Friday 13th March 2026
12:07:03 PM
Home > తాజా > తార్నాక ఆర్టీసీ ఆసుపత్రికి కొత్త హంగులు!

తార్నాక ఆర్టీసీ ఆసుపత్రికి కొత్త హంగులు!

portable x ray mechine for tarnaka rtc hospital

‌- రోగుల వద్దకే పోర్టబుల్ ఎక్స్ రే సేవలు

Tarnaka RTC Hospital | తెలంగాణ ఆర్టీసీ (TGSRTC) ఉద్యోగుల ఆరోగ్య ప్రదాయిని అయిన తార్నాక ఆర్టీసీ ఆసుపత్రి మరో కీలక మైలురాయిని చేరుకుంది. సంస్థ వీసీ & ఎండీ వై. నాగిరెడ్డి గారి చొరవతో వైద్య సేవల్లో అత్యాధునిక సాంకేతికత అందుబాటులోకి వచ్చింది.

సామాజిక బాధ్యత (CSR)లో భాగంగా కెనరా బ్యాంక్ అనుబంధ సంస్థ ‘క్యాన్ ఫిన్ హోమ్స్’ అందజేసిన రూ. 20 లక్షల విలువైన ‘మొబైల్ డిజిటల్ పోర్టబుల్ ఎక్స్‌రే’ మిషన్‌ను శుక్రవారం ప్రారంభించారు.

రోగుల వద్దకే వైద్యం

కెనరా బ్యాంక్ తెలంగాణ జోనల్ హెడ్ గూడ లక్ష్మణ్, ఆసుపత్రి సూపరింటెండెంట్ & సీఎంఓ ఎన్.శైలజ మూర్తి రిబ్బన్ కట్ చేసి ఈ నూతన యంత్రాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా శ్రీమతి శైలజ మూర్తి మాట్లాడుతూ.. “సాధారణంగా ఎక్స్‌రే తీయాలంటే రోగులు వార్డు నుంచి ల్యాబ్ వరకు వెళ్లాల్సి ఉంటుంది.

కానీ ఈ పోర్టబుల్ ఎక్స్‌రే మిషన్ వల్ల వార్డుల్లో చికిత్స పొందుతున్న పేషెంట్ల వద్దకే నేరుగా వెళ్లి ఎక్స్‌రే తీసే అవకాశం ఉంటుంది. దీనివల్ల సమయం ఆదా అవ్వడమే కాకుండా, రోగులకు త్వరితగతిన మెరుగైన చికిత్స అందుతుంది” అని వివరించారు.

అభినందనీయమైన సామాజిక సేవ

కెనరా బ్యాంక్ జోనల్ హెడ్ శ్రీ గూడ లక్ష్మణ్ మాట్లాడుతూ.. ఆర్టీసీ ఉద్యోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించడంలో తార్నాక ఆసుపత్రి సిబ్బంది కృషి ప్రశంసనీయమని కొనియాడారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో కెనరా బ్యాంక్ ఎల్లప్పుడూ ముందుంటుందని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో ఆసుపత్రి మెడికల్ అడ్మినిస్ట్రేటర్ శ్రీ పి. శ్రీనివాస్, కెనరా బ్యాంక్ మేనేజర్లు టి.టి. అచ్యుతానందం, అశోక్ గౌతమ్, పలువురు వైద్యులు మరియు బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions