Suspended TMC MLA Humayun Kabir lays ‘Babri-style’ mosque foundation | ఉత్తరప్రదేశ్ లోని అయోధ్యలో 1992 డిసెంబర్ ఆరున బాబ్రీ మసీద్ కూల్చివేత జరిగిన విషయం తెల్సిందే. అయితే ఈ ఘటన జరిగిన మూడు దశాబ్దాల తర్వాత మళ్ళీ బాబ్రీ మసీద్ కు పునాది రాయి పడింది. కానీ ఉత్తరప్రదేశ్ లో కాదు పశ్చిమ బెంగాల్ లో. రాష్ట్రంలోని ముర్షిదాబాద్ లోని బెల్దంగా ప్రాంతంలో బాబ్రీ మసీద్ పేరుతో ఓ మసీదును నిర్మించనున్నట్లు బహిష్కృత టీఎంసీ ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ ఇటీవలే ప్రకటించారు.
ఈ మేరకు శనివారం పునాది రాయి వేశారు. ఈ కార్యక్రమానికి వేలాది సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. మరికొంతమంది తమ తలపై పునాది రాళ్లను తీసుకుని వెళ్లారు. త్రినముల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ బాబ్రీ మస్జీద్ ను నిర్మించబోతున్నట్లు చేసిన ప్రకటన జాతీయంగా తీవ్ర సంచలనంగా మారింది. ఈ క్రమంలో సదరు ఎమ్మెల్యేను ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పార్టీ నుండి సస్పెండ్ చేశారు.
అయినప్పటికీ హుమాయున్ కబీర్ మాత్రం వెనక్కు తగ్గలేదు. ప్రకటించిన విధంగానే శనివారం బాబ్రీ మసీద్ పేరుతో నిర్మించబోయే మసీదుకు శంకుస్థాపన చేశారు. ఈ మసీద్ కూడా బాబ్రీ మస్జీద్ ను పోలే విధంగా ఉంటుందని ఆ ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఇకపోతే ముర్షిదాబాద్ అత్యంత సున్నితమైన ప్రాంతం అనే విషయం తెల్సిందే.









