Wednesday 18th March 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > ఎక్స్ లో 2 బిలియన్ పెట్టుబడి..మస్క్ కు జైల్లో ఉన్న సుకేశ్ లేఖ

ఎక్స్ లో 2 బిలియన్ పెట్టుబడి..మస్క్ కు జైల్లో ఉన్న సుకేశ్ లేఖ

Sukesh Chandrasekhar offers Elon Musk $2 billion investment | ఆర్థిక నేరగాడు, రూ.200 కోట్ల మోసానికి సంబంధించి ప్రస్తుతం ఢిల్లీ మండోలీ జైలులో ఉన్న సుకేశ్ చంద్రశేఖర్ ప్రపంచ కుబేరుడు, టెస్లా ( Tesla ) అధినేత ఎలాన్ మస్క్ కు లేఖ రాశాడు.

జైల్లో కూర్చుని అతడు రాసిన లేఖ తాజగా బయటకు వచ్చింది. తనకు తన సన్నిహితురాలు, సినీ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ( Jacqueline Fernandez ) కు ఎక్స్ ( X ) అంటే అమితమైన ఇస్తామంటూ లేఖలో ప్రస్తావించాడు. ఈ క్రమంలోనే ఎక్స్ లో పెట్టుబడి పెట్టడానికి సిద్దమంటూ తెలిపాడు.

ఇప్పటికిప్పుడే బిలియన్ డాలర్లు పెట్టుబడికి సిద్ధమని, మరో బిలియన్ డాలర్లు వచ్చే ఏడాది పెట్టుబడి పెట్టడానికి తాను ఒకే అంటూ ఎలాన్ మస్క్ కు లేఖను రాశాడు. మస్క్ తన మనిషంటూ లేఖలో సుకేశ్ రాశాడు.

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ( Donald Trump ) విజయంలో ఎలాన్ మస్క్ పోషించిన పాత్రను జైల్లో ఉన్న సుకేశ్ అభినందించాడు.అంతేకాకుండా నటి జాక్వెలిన్ ను తన లేడి లవ్ అంటూ సంభోదించాడు.

కాగా గతంలో ఆర్థిక నేరాల కేసులో అరెస్టైన సుకేశ్ జాక్వెలిన్ తన లవర్ అంటూ చెప్పడం సంచలనంగా మారిన విషయం తెల్సిందే. మరోవైపు సుకేశ్ తనకు తాను కేంద్రంలో ముఖ్య అధికారంటూ పరిచయం చేసుకుని తనను మోసం చేశాడని నటి జాక్వెలిన్ వాపోయిన విషయం తెల్సిందే.

You may also like
ponguleti srinivasa reddy
‘ప్రగతి పథంలో పేదల సంక్షేమం’
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!
jagan
ఉప ప్రధానిగా చంద్రబాబు.. జగన్ సెటైర్లు !
gaddar awards
గద్దర్ సినీ అవార్డులను ప్రకటించిన ప్రభుత్వం.. ఉత్తమ చిత్రం ఏదంటే!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions