Sunday 8th September 2024
12:07:03 PM
Home > తాజా > కోమటిరెడ్డి ఇంట్లో నేతల భేటీ… కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం…!

కోమటిరెడ్డి ఇంట్లో నేతల భేటీ… కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం…!

congress party

Congress Leaders Meeting In Komatireddy House

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆయన ఇంట్లో సమావేశానికి కాంగ్రెస్ సీనియర్ ( Senior ) నేతలను ఆహ్వానించారు.

కర్ణాటక అసెంబ్లీ ( Karnataka Assembly ) ఎన్నికల విజయం తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నానాటికి బలం పెంచుకుంటున్నది.

కర్నాటక విజయంతో పార్టీ నాయకుల్లో, కార్యకర్తల్లో పోరాడితే గెలుస్తాం అనే నమ్మకం పెరిగినట్లు కనిపిస్తున్నది.

తెలంగాణలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా పార్టీ నాయకులు వ్యూహాలని రచిస్తున్నారు. అందులో భాగంగానే కోమటిరెడ్డి ఇంట్లో కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు సమావేశం అయ్యారు.

ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ మరియు బీఆరెస్ పార్టీల మధ్య విద్యుత్ యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో ఈ భేటీ చర్చనీయాంశంగా మారింది.

ఈ భేటీకి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ( Incharge ) మాణిక్ రావు ఠాక్రే, రేవంత్, భట్టి, జానా రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి సహా సీనియర్ నేతలు హాజరయ్యారు.

Read Also: చిరంజీవిపై ఆరోపణలు.. జీవిత, రాజశేఖర్ దంపతులకు ఏడాది జైలు శిక్ష…బెయిల్..!

Komati Reddy Interesting Comments Ahead Of Meeting | సమావేశం సంధర్బంగా కోమటిరెడ్డి మీడియా ( Media )తో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు మూడు నెలల సమయం మాత్రమే ఉందని, దానికి తగ్గట్టు ఈ సమావేశంలో ఎన్నికల రోడ్ మ్యాప్ ( Road Map ) ను నిర్ణయిస్తామని కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు.

తమ పార్టీ గెలిస్తే ఎటువంటి కార్యక్రమాలు అమలు చేయనుందో అని బస్సు యాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్లడంపై సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.

ఇన్నిరోజులు దళిత దండోరాలు, డిక్లరేషన్లు, పబ్లిక్ మీటింగ్స్ ( Public Meetings ) నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ రానున్న కాలంలో నాయకులంతా కలిసి ఏ విధంగా ప్రజల్లోకి వెళ్లాలనే అంశం గురించి చర్చించనున్నట్లు ఆయన అన్నారు.

పార్టీలో చేరికల విషయం గురుంచి ఇంచార్జ్ ఠాక్రే ఆదేశాల మేరకు ముందుకు వెళ్తామని కోమటిరెడ్డి స్పష్టం చేశారు.

ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న 12 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని వెంకట్ రెడ్డి ధీమా వ్యక్తంచేశారు.

You may also like
cm revath reddy
ఆరోగ్యంతో చెలగాటమాడితే సస్పెండ్
మా పోటీ ఆంధ్ర ప్రదేశ్ తో కాదు: సీఎం రేవంత్ రెడ్డి
cm revanth
సీఎం రేవంత్ తో అందే శ్రీ, ఎంఎం కీరవాణి భేటీ.. కారణమిదేనా!
komatireddy venkat reddy
కేసీఆర్ మోకాళ్ల యాత్ర చేసిన గెలవరు: మంత్రి కోమటిరెడ్డి

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions