Samantha Father Passes Away | సినీ నటి సమంత కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. సమంత తండ్రి జోసెఫ్ ప్రభు ( Joseph Prabhu ) శుక్రవారం తుదిశ్వాస విడిచారు.
కార్డియాక్ అరెస్ట్ తో ఆయన మృతిచెందినట్లు తెలుస్తోంది. జోసెఫ్ ప్రభు తెలుగు ఆంగ్లో ఇండియన్. జోసెఫ్ ప్రభు, నినెట్ ప్రభు ( Ninette Prabhu ) దంపతులకు సమంత జన్మించారు. సమంతనే కాకుండా ఈ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు.
కాగా తండ్రి మరణ వార్తను సమంత ఇన్స్టా స్టోరీ ( Instagram Story ) లో షేర్ చేశారు. హార్ట్ బ్రేక్ ఎమోజీ ( Heart Break Emoji )తో ‘ మళ్ళీ మనం కలిసేంతవరకు నాన్న ‘ అని పోస్ట్ చేశారు. తన జీవితంలో తండ్రి ముఖ్య పాత్ర పోషించినట్లు సమంత అనేక సార్లు చెప్పారు.
సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చాక తల్లిదండ్రులు తనకు అండగా, మద్దతుగా నిలిచారని సమంత చెప్పేవారు. సమంత తండ్రి మరణం పట్ల ప్రముఖులు, అభిమానులు సంతాపం ప్రకటిస్తున్నారు. రేపు చెన్నై లో జోసెఫ్ ప్రభు అంత్యక్రియలు జరిగే అవకాశం ఉంది.