Saturday 31st January 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > బాబా సిద్దిఖీ హత్య..షూటింగ్ రద్దు చేసుకుని ఆసుపత్రికి వెళ్లిన సల్మాన్ ఖాన్

బాబా సిద్దిఖీ హత్య..షూటింగ్ రద్దు చేసుకుని ఆసుపత్రికి వెళ్లిన సల్మాన్ ఖాన్

Salman Khan Reaction On Baba Siddique Death | ఎన్సీపీ ( NCP ) సీనియర్ నాయకులు బాబా సిద్దిఖీ ( Baba Siddique ) హత్యకు గురికావడం మహారాష్ట్రలో సంచలనంగా మారింది. శనివారం బాబా సిద్దిఖీ పై దుండగులు కాల్పులు జరిపిన విషయం తెల్సిందే.

లీలావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో బాబా సిద్దిఖీ తుదిశ్వాస విడిచారు. ఈ నేపథ్యంలో నివాళి అర్పించేందుకు సినీ, రాజకీయ ప్రముఖులు పెద్ద ఎత్తున ఆసుపత్రికి చేరుకుంటున్నారు.

బాబా సిద్దిఖీకి బాలీవుడ్ ( Bollywood ) ప్రముఖులతో మంచి సంబంధాలు ఉన్నాయి. మరీ ముఖ్యంగా సల్మాన్ ఖాన్ ( Salman Khan ) కు ఆయన అత్యంత సన్నిహితుడు. ఈ క్రమంలో కాల్పుల విషయం తెలుసుకున్న సల్మాన్ ఖాన్ హుటాహుటిన ఆసుపత్రికి చేరుకున్నారు.తన స్నేహితుడు సిద్దిఖీ హత్యకు గురైన సమయంలో సల్మాన్ హిందీ బిగ్ బాస్ ( Bigg Boss ) వీకెండ్ ఎపిసోడ్ షూటింగ్ లో ఉన్నారు. మరణ వార్త విన్న వెంటనే మిగిలిన షూటింగ్ ను రద్దు చేసుకుని ఆసుపత్రికి వెళ్లారు.

అలాగే బాబా సిద్దిఖీకి ప్రముఖ నటి శిల్పా శెట్టి ( Shilpashetty ) ఆమె భర్త రాజ్ కుంద్రా నివాళులర్పించారు. ఆసుపత్రి నుండి బయటకు వస్తున్న సమయంలో శిల్పాశెట్టి కన్నీటి పర్యంతం అయ్యారు.

You may also like
‘లేడికి-లేడి గెటప్ కు తేడా తెలీదా’..జగన్ కు కమెడియన్ కౌంటర్
పాడి కౌశిక్ పై ఎంఐఎం, ఐపీఎస్ సంఘం తీవ్ర ఆగ్రహం
ఖమ్మం మంత్రిపై వైఎస్ జగన్ కు ఫిర్యాదు
మేడారంలో అద్భుత దృశ్యం..జనంలోకి సమ్మక్క

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions