Thursday 21st November 2024
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > రాహుల్ గాంధీ నాలుక కోస్తే రూ.11 లక్షలు..ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు

రాహుల్ గాంధీ నాలుక కోస్తే రూ.11 లక్షలు..ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు

RS 11 Lakh For Rahul Gandhi Tongue | కాంగ్రెస్ అగ్ర నాయకులు, లోకసభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ( Rahul Gandi )నాలుక కోస్తే రూ.11 లక్షలు ఇస్తానని ఓ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

మహారాష్ట్రకు చెందిన శివసేన ఎక్నాథ్ షిండే ( Shinde Shivasena ) పార్టీకి చెందిన ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ ( Sanjay Gaikwad ) సోమవారం ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మరి కొన్ని నెలల్లో మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.

ఈ నేపథ్యంలో పార్టీల మధ్య డైలాగ్ వార్ కొనసాగుతుంది. అయితే ప్రస్తుతం సంజయ్ గైక్వాడ్ చేసిన వ్యాఖ్యలు ఆ రాష్ట్ర రాజకీయల్ని కుదిపేస్తున్నాయి. అమెరికా పర్యటనలో భాగంగా రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై సదరు ఎమ్మెల్యే స్పందించారు.

రాహుల్ గాంధీ రిజర్వేషన్లను అంతం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఇదిలా ఉండగా ఎమ్మెల్యే సంజయ్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ( Congress ) తీవ్రంగా మండిపడింది.

You may also like
మహారాష్ట్ర ఎన్నికలు..ఓటుకు నోటు వివాదం
ఎన్నికలు మహారాష్ట్రలో..వసూళ్లు తెలంగాణలో
హర్యాణా ఫలితాలు..ఆధిక్యంలో మేజిక్ ఫిగర్ ను దాటేసిన బీజేపీ
ఆ పెంపుడు శునకం అంటే సోనియా గాంధీకి ఇష్టం

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions