Rashmika Mandanna | నటి రష్మిక మందన్నపై మండిపడుతున్నారు కన్నడ వాసులు. సొంత ఊరును మర్చిపోతే ఎలా అంటూ నిలదీస్తున్నారు.
విక్కీ కౌశల్ ( Vicky Kaushal ), రష్మిక జంటగా నటించిన సినిమా ‘ఛావా’ ( Chhaava ). ఫిబ్రవరి 14న విడుదలైన ఈ సినిమా మంచి హిట్ ను సొంతం చేసుకుంది. అయితే సినిమా రిలీజ్ కంటే ముందు ఒక ఈవెంట్ లో పాల్గొన్న రష్మిక, చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
‘నేను హైదరాబాద్ నుండి వచ్చాను. మీ కుటుంబంలో బాగమైనందుకు సంతోషంగా ఉంది’ అంటూ ముంబైలో జరిగిన ఈవెంట్ లో అభిమానుల్ని ఉద్దేశించి రష్మిక కామెంట్స్ చేశారు. ఈ వ్యాఖ్యలే కన్నడిగల ఆగ్రహానికి కారణమయ్యింది.
కర్ణాటక ( Karnataka )లో పుట్టి పెరిగి ఇప్పుడు హైదరాబాద్ పేరు చెప్పడం ఏంటని కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కర్ణాటక కొడుగు ( Kodugu ) జిల్లా విరాజ్ పేట్ ( Virajpet ) రష్మిక సొంతూరు. ఈ క్రమంలో విరాజ్ పేట్ హైదరాబాద్ కు ఎప్పుడు వచ్చిందని కన్నడ ఫ్యాన్స్ నటిపై కామెంట్లు చేస్తున్నారు.