Raj Shekhawat Warns Pushpa-2 Movie Makers | ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ( Icon Star Allu Arjun ) కథానాయకుడిగా వచ్చిన పుష్ప-2 ది రూల్ ( Pushpa-2 The Rule ) బాక్స్ ఆఫీసు వద్ద భారీ విజయాన్ని నమోదు చేసింది. కలెక్షన్ల సునామీని క్రియేట్ చేసింది.
కానీ తాజాగా పుష్ప-2 వివాదంలో చిక్కుకుంది. తమ కమ్యూనిటీ మనోభావాలను దెబ్బతీశారని ఓ నేత సినిమా యూనిట్ కు వార్నింగ్ ఇచ్చారు. పుష్ప-2 లో ఫాహాద్ ఫాజిల్ పాత్రకు షెకావత్ అనే పేరు ఉంది.
అయితే సినిమాలో షెకావత్ అనే పేరున్న వ్యక్తిని నెగటివ్ గా చూపించి తమ కమ్యూనిటీని అవమానించారని క్షత్రియ కర్ణి సేన లీడర్ రాజ్ షెకావత్ ఆగ్రహించారు. సినిమా వాళ్ళు క్షత్రియులను అవమానించడం ఎక్కువైపోయిందని కన్నెర్ర చేశారు.
ఇప్పటికైనా సినిమాలోని పాత్రకు షెకావత్ అనే పేరును తొలగించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పుష్ప 2 నిర్మాతలపై భౌతిక దాడి చేయడానికి కూడా తాము వెనుకాడబోమని పేర్కొన్నారు. ఆయన విడుదల చేసిన వీడియో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.