Saturday 28th February 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > మోదీ మాటిచ్చారన్న ట్రంప్..ప్రధానిపై రాహుల్ నిప్పులు

మోదీ మాటిచ్చారన్న ట్రంప్..ప్రధానిపై రాహుల్ నిప్పులు

Rahul Gandhi jabs PM over halt on Russia oil buys claim | ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రష్యా నుంచి చమురు కొనుగోలును ఆపేయనున్నట్లు ప్రధాని మోదీ తనకు మాటిచ్చారని ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ప్రపంచ వ్యాప్తంగా చర్చకు దారి తీశాయి.

ఈ నేపథ్యంలో లోకసభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పందించి ప్రధానిపై ప్రశ్నల వర్షం కురిపించారు. డోనాల్డ్ ట్రంప్ ను చూసి మోదీ భయపడ్డారని ఎద్దేవా చేశారు. ‘భారత్ రష్యా నుంచి చమురు కొనుగోలు చేయదని ట్రంప్ నిర్ణయించి ప్రకటించే అనుమతిని ఇచ్చారు. పదేపదే అవమానాలు ఎదురైనప్పటికీ అభినందన సందేశాలు పంపుతూనే ఉన్నారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అమెరికా పర్యటనను రద్దు చేసుకున్నాం. ఈజిప్ట్ లోని షర్మ్ ఎల్-షేక్‌ లో ఇటీవల జరిగిన ఇజ్రాయిల్-హమాస్ శాంతి ఒప్పంద కార్యక్రమానికి ప్రధాని హాజరు కాలేదు. ఆపరేషన్ సిందూర్‌పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పదే పదే వ్యాఖ్యలు చేసినా వ్యతిరేకించలేదు’ అని రాహుల్ గాంధీ ఫైర్ అయ్యారు.

You may also like
ఇరాన్ పై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్..ఏం జరగనుందో!
GHMC చట్టం స్థానంలో కోర్ అర్బన్ చట్టం
బల్కంపేట ఆలయంలో మంత్రి ఆకస్మిక తనిఖీ..అధికారులపై వేటు
బొత్సకు బ్రెయిన్ స్ట్రోక్..స్పందించిన పవన్

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions