Sunday 1st March 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > ఇరాన్ దాడులు..చిక్కుకున్న పీవీ సింధు, మంచు విష్ణు

ఇరాన్ దాడులు..చిక్కుకున్న పీవీ సింధు, మంచు విష్ణు

PV Sindhu and Manchu Vishnu’s Family Stuck in Dubai | ఇరాన్ పై అమెరికా ఇజ్రాయెల్ దాడుల్లో ఆ దేశ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మృతి చెందడంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరాయి. గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ దాడులు చేస్తోంది. మరీ ముఖ్యంగా యూఏఈ, ఖతార్, బహ్రెయిన్ దేశాలపై మిస్సైళ్లతో ఇరాన్ విరుచుకుపడుతుంది. ఇలా దుబాయ్ లో కూడా మిస్సైళ్ల దాడులు కొనసాగుతున్నాయి. దింతో లక్షలాది మంది బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. కుటుంబంతో కలిసి దుబాయ్ వెళ్లిన మంచు విష్ణు, మరియు ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్ లో పాల్గొనేందుకు బయలుదేరిన పీవీ సింధు దుబాయ్ లో చిక్కుకున్నారు. ఉద్రిక్తతల నేపథ్యంలో దుబాయ్ విమానాశ్రయంలో అన్ని విమానాలు రద్దు అయ్యాయి.

విమానాశ్రయంలో ప్రయాణికులు భారీగా చిక్కుకున్న దృశ్యాలను సోషల్ మీడియాలో షేర్ చేసిన పీవీ సింధు అన్ని విమానాలు రద్దు అయినట్లు పేర్కొన్నారు. పరిస్థితి గంటగంటకు భయానకంగా మారుతోందని, విమానాశ్రయం వద్ద పేలుడు జరిగినట్లు పేర్కొన్నారు. అధికారులు తమను సురక్షిత ప్రాంతానికి తరలించినట్లు వెల్లడించారు. మరోవైపు ఇరాన్ వదిలిన మిస్సైళ్ళు దుబాయ్ లోకి దూసుకువస్తున్న దృశ్యాలను మంచు విష్ణు షేర్ చేసి శాంతి నెలకొనాలని ప్రార్ధించారు.

You may also like
‘బీఆర్ నాయుడు కాదు..బీఆర్ కామ నాయుడు’
టీటీడీ ఛైర్మన్ వైరల్ వీడియోలు..స్పందించిన బీఆర్ నాయుడు
ఇరాన్ సుప్రీం లీడర్ మృతి..వరల్డ్ వార్-3?
జమ్మూ జయహో..67 ఏళ్ల నిరీక్షణకు తెర!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions