Modi Congratulates Trump | అమెరికా (America) అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) భారీ విజయం దిశగా దూసుకెళుతున్నారు. రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధమయ్యారు.
ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ట్రంప్ కు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. భారత ప్రధాని నరేంద్రమోదీ, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు (Benjamin Netanyahu) ట్రంప్ కు శుభాకాంక్షలు తెలిపారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో చారిత్రాత్మక విజయం సాధించిన డొనాల్డ్ ట్రం ప్ కు హృదయపూర్వక శుభాకాంక్షలు అని ప్రధాని మోదీ ఎక్స్ లో పోస్ట్ చేశారు.
ఇకపై భారత్ – అమెరికా (Bharat – America) ప్రజల కోసం కలిసి పనిచేద్దామని, ప్రపం చ శాం తి, సుస్థిరత్వం , శ్రేయస్సు కోసం కృ షి చేద్దామని మోదీ పిలుపునిచ్చారు. ట్రంప్ వైట్ హౌస్ లోకి తిరిగిరావడం ఒక కొత్త అధ్య యనానికి నాందిగా అభివర్ణించారు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం దిశగా దూసుకెళ్తున్న డొనాల్డ్ ట్రంప్ – మెలానియా కు శుభాకాంక్షలు తెలిపారు. ట్రంప్ హయాంలో అమెరికా – ఇజ్రాయెల్ (America – Israel) ల మధ్య బంధం మరింత బలపడుతుందని భావిస్తున్నట్లు నెతన్యాహు పేర్కొన్నారు.