Prada’s ‘new’ sandal looks awfully familiar to Kolhapuri chappal | శతాబ్దాల పాటు సంపదను దోచుకున్నారు. ఇప్పుడు చెప్పులను సైతం వదలడం లేదు.
భారతదేశంలోనే ప్రసిద్ధి గాంచిన చెప్పులను లగ్జరీ శాండీల్స్ అని చెబుతూ రూ.లక్షలకు అమ్ముతున్నారు. కొల్హాపూర్ చెప్పులు భారత్ లో ఎంతో ఫేమస్. వీటిని సుమారు 800 సంవత్సరాల క్రితమే భారతీయులు తయారు చేయడం ప్రారంభించారు.
ఈ చెప్పులకు భారత కేంద్ర ప్రభుత్వం జీఐ ట్యాగును కూడా కేటాయించింది. వీటి ప్రత్యేకతను రక్షించడం కోసం ప్రభుత్వం జీఐ ట్యాగ్ కేటాయించింది. సాధారణంగా ఇవి రూ.500 లకు దొరుకుతాయి. అయితే ఇటలీ దేశానికి చెందిన లగ్జరీ ఫ్యాషన్ బ్రాండ్ అయిన ‘ప్రడా’ మాత్రం కొల్హాపూర్ చెప్పుల డిజైన్ ను కాపీ కొట్టేసింది.
అచ్చం కొల్హాపూర్ చెప్పులను పోలె విధంగా ఉన్న వాటికి లగ్జరీ శాండీల్స్ అని ముద్ర వేసి ఏకంగా రూ.లక్షలకు అమ్మేస్తుంది. ఇటీవల జరిగిన ఒక ఫ్యాషన్ షోలో వీటిని ప్రదర్శించారు. అయితే ప్రడా కొల్హాపూర్ చెప్పులను కాపీ కొట్టడం పట్ల భారతీయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తమ సొంత డిజైమ్ లాగా ప్రడా వ్యవహారించడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పశ్చిమ దేశాల ఇప్పుడు సంస్కృతిని కూడా దోపిడీ చేస్తున్నాయని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు. భారతీయ వారసత్వాలను కాపీ కొట్టి తమదిగా చెప్పుకోవడం ఏంటని ప్రడా లాంటి లగ్జరీ బ్రాండ్స్ ను నిలదీస్తున్నారు. అసలైన రూపకర్తలకు తగిన గుర్తింపు కూడా ఇవ్వలేదని మండిపడుతున్నారు.









