Ponnam Prabhakar News | వరుసగా జరుగుతున్న ఘోర రోడ్డు ప్రమాదాల కారణంగా ప్రయాణికులు ప్రాణాలు కోల్పోతుండడం తీవ్ర విషాదంగా మారింది. ఈ క్రమంలో రాష్ట్రంలో వరుస ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రమాదాలు జరగకుండా రవాణా శాఖ అధికారులు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్.
ఈ మేరకు ఆ శాఖ అధికారులతో సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. చేవెళ్లలో జరిగిన ప్రమాదం గురించి మాట్లాడుతూ రెండు వాహనాలకు ఫిట్నెస్ ఉన్నప్పటికీ డివైడర్ లేకపోవడం మూలంగానే ప్రమాదం జరిగిందని చెప్పారు. వాహనాల స్పీడ్ లాక్ ఎంత వరకు అమలవుతున్నాయి అనేది తనిఖీలు చేసి బ్రేక్ చేస్తే ట్రిపుల్ పెనాల్టీ వేయాలన్నారు. రవాణా శాఖ గౌరవాన్ని పెంపొందించేలా ఉద్యోగులు పని చేయాలని తెలిపారు. అందరూ ఎఫెక్టివ్ గా పని చేయాలని నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని పేర్కొన్నారు.
రవాణా శాఖ అధికారులు ప్రత్యేక యాక్షన్ ప్లాన్ ద్వారా ప్రతి జిల్లాలో కఠినంగా వ్యవహరిస్తేనే రోడ్డు ప్రమాదాలను కంట్రోల్ చేయవచ్చన్నారు. టిప్పర్ లారీలు ఇసుక, డస్ట్ తీసుకెళ్లేటప్పుడు టార్పలిన్ కప్పుకొని తీసుకోని వెళ్లే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో రైతులు ధ్యానం తరలింపుకు ఉపయోగించే వాహనాలను వేధింపులకు గురి చేయొద్దని అధికారులు సూచించారు.









