Police Complaint On Ambati Rambabu | వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు ( Ambati Rambabu ) పై పోలీసులు కేసు పెట్టారు. బుధవారం తన అనుచరులతో కలిసి గుంటూరులోని పట్టాభిపురం పోలీస్ స్టేషన్ కు అంబటి రాంబాబు వెళ్లారు.
టీడీపీ, జనసేన సోషల్ మీడియా పై ఫిర్యాదు చేశారు. అనంతరం ఎప్పటిలోపు చర్యలు తీసుకుంటారో చెప్పాలి అంటూ తోటి నేతలతో కలిసి పోలీసు స్టేషన్ మెట్లపై నిరసనకు దిగారు.
చేతిలో ప్లకార్డులు పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో పోలీసులు గురువారం అంబటి రాంబాబు పైనే కేసును నమోదు చేశారు. విధులకు ఆటంకం కలిగించారని పట్టాభిపురం పోలీసులు అంబటి పై కేసు నమోదు చేశారు.
ఈ నేపథ్యంలో అంబటి స్పందించారు. ‘ నా Complaints పై Action తీసుకోవాలని కోరితే మా మీదే కేసు పెట్టారు. ఎంత వరకు ధర్మం దీనిలో పోలీసు వారిని తప్పు పట్టను, మొత్తం నడిపిస్తుంది లోకేషే ‘ అని ఆరోపించారు.