PM Modi Apology | మహారాష్ట్ర లోని సిందుదుర్గ్ (Sindhudurg) జిల్లా మాల్వాన్ లోని రాజ్కోట్ కోటలో 35 అడుగుల భారీ శివాజీ (Shivaji Statue) విగ్రహం ఇటీవల ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటన మహారాష్ట్ర రాజకీయల్ని కుదిపేస్తుంది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ స్పందించారు.
తొమ్మిది నెలల్లోనే విగ్రహం కూలిన ఉదంతం పై ప్రధాని విచారం వ్యక్తం చేశారు. ఛత్రపతి శివాజీ మహరాజ్ కు, ఆ యోధుడి విగ్రహం కూలడం వల్ల మనోభావాలు దెబ్బతిన్న ప్రజలు క్షమాపణలు కోరుతున్నట్లు ప్రధాని వ్యాఖ్యానించారు.
మహారాష్ట్ర లోని పాల్ ఘర్ జిల్లాలో వధావన్ పోర్టు ప్రాజెక్టుకు పీఎం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా, ఛత్రపతి శివాజీ మహరాజ్ కేవలం ఒక రాజు మాత్రమే కాదని, ఆయన ఒక దైవం అని పేర్కొన్నారు.
విగ్రహం కూలడం పట్ల తల వంచి ఆయన పాదాలకు ప్రధాని మోదీ క్షమాపణలు కోరారు. కాగా గతేడాది డిసెంబర్ 4న నేవి డే సందర్భంగా ప్రధాని మోదీ, సీఎం ఎక్నాథ్ షిండే శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరించారు.