Sunday 20th April 2025
12:07:03 PM
Home > తాజా > వైఎస్ జగన్ ఇంటికి నోటీసులు? స్పందించిన హైడ్రా కమిషనర్!

వైఎస్ జగన్ ఇంటికి నోటీసులు? స్పందించిన హైడ్రా కమిషనర్!

lotus pond

Hydra Notice To Lotus Pond News | జీహెచ్ఎంసీ (GHMC) పరిధిలో చెరువులు ఆక్రమించి నిర్మించిన అక్రమ కట్టడాలను హైడ్రా (HYDRA) కూల్చివేస్తున్న విషయం తెలిసిందే. చెరువులు, కుంటలు, నాలాలు ఆక్రమించి ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్లలో నిర్మించిన కట్టడాలను అధికారులు నేలమట్టం చేస్తున్నారు.

సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సోదరుడు తిరుపతి రెడ్డికి సైతం హైడ్రా అధికారులు నోటీసులు పంపారు. తాజాగా ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్‌కు చెందిన లోటస్ పాండ్ ఇంటికి సైతం హైడ్రా నోటీసులు జారీ చేసినట్లు మీడియాలో ప్రచారం జరుగుతోంది.

ఈ నేపథ్యంలో ఆ వార్తలపై హైడ్రా కమిషనర్ (Hydra Commissioner) ఏవీ రంగనాథ్ (AV Ranganath) తాజాగా స్పందించారు. జగన్‌ ఇంటికి నోటీసుల ఇచ్చినట్లుగా సోషల్ మీడియాలో జరగుతున్న ప్రచారం అవాస్తవమని చెప్పారు. సోషల్‌ మీడియాలో తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారని తెలిపారు. తాము ఎటువంటి నోటీసులు ఇవ్వలేదని పేర్కొన్నారు.  

You may also like
av rangananth
ఆ భూములు కొనొద్దు.. ప్రజలకు హైడ్రా కమిషనర్ కీలక సూచన!
hydraa
ఆ తేదికి ముందు కట్టిన నిర్మాణాలను కూల్చబోం: రంగనాథ్
av ranganath
త్వరలో హైడ్రా పోలీస్ స్టేషన్.. ఎఫ్ఎం ఛానల్ కూడా: రంగనాథ్!
AV RANGANATH
ఆ నిర్మాణాలను కూల్చం: హైడ్రా రంగనాథ్ కీలక ప్రకటన!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions