PM Modi visits Sree Shivaji Spoorthi Kendra in Srisailam | ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం కర్నూలులో పర్యటించారు. ఈ సందర్భంగా తొలుత శ్రీశైలం దేవాలయాన్ని సందర్శించారు. ఆయన వెంట ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారు.
ఆలయ అర్చకులు, అధికారులు ప్రధాని, సీఎం, డిప్యూటీ సీఎంకు స్వాగతం పలికారు. అనంతరం భ్రమరాంబ మల్లిఖార్జున స్వామీని ప్రధాని దర్శించుకున్నారు. అనంతరం శ్రీశైలంలోని శివాజీ ధ్యాన మందిరం మరియు శివాజీ దర్బార్ హాల్‌ను సందర్శించారు. మహాన్ ఛత్రపతి శివాజీ మహారాజ్ 1677లో శ్రీశైలం వచ్చి, శ్రీశైలం మల్లికార్జున మందిరంలో ప్రార్థించారని గుర్తుచేశారు.
అలాగే ధ్యాన మందిరంలో ఆయన ధ్యానం చేసి, భ్రమరాంబ దేవి ఆశీస్సులు పొందారని పేర్కొన్నారు. తోటి భారతీయుల సౌభాగ్యం కోసం,వారి ఆరోగ్యం కోసం శ్రీ భ్రమరాంభ మల్లికార్జున స్వామి ప్రార్ధించినట్లు ప్రధాని చెప్పారు.









