PM Modi to Attend RSS Centenary Celebrations in New Delhi | ఢిల్లీలోని బీఆర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్ లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శతాబ్ది ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఆరెస్సెస్ ఉత్సవాల నేపథ్యంలో రూ.వంద నాణేన్ని, పోస్టల్ స్టాంప్ ను విడుదల చేశారు. నాణెంపై ఓ వైపు జాతీయ చిహ్నం మరోవైపు భారతమాత చిత్రం ఉంటుందని ప్రధాని వివరించారు. స్వతంత్ర భారత చరిత్రలో కరెన్సీ పై భారతమాత చిత్రం ఉండడం ఇదే తొలిసారి అని ప్రధాని హర్షం వ్యక్తం చేశారు. అలాగే నాణెంపై ఆరెస్సెస్ నినాదాన్ని ముద్రించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన ప్రధాని దేశమే ప్రథమం అని విశ్వసించే ఆరెస్సెస్ కార్యకర్తలు బ్రిటిష్, హైదరాబాద్ నిజాం చేతుల్లో అణిచివేతకు గురయ్యారని తెలిపారు. దేశ స్వాతంత్య్రం కోసం ఆరెస్సెస్ నాయకులు జైళ్లకు వెళ్లినట్లు చెప్పారు.










