PM Modi speaks with Netanyahu | ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో ఫోన్లో మాట్లాడారు భారత ప్రధాని నరేంద్ర మోదీ. ప్రస్తుతం పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు కలిసి ఇరాన్‌పై భారీ దాడులు చేస్తున్నాయి.
మరోవైపు తమ సుప్రీం లీడర్ అయతోల్లా అలీ ఖమేనీ మరణించిన నేపథ్యంలో ఇరాన్ ప్రతీకార చర్యలకు ఉపక్రమించింది. ఇందులో భాగంగా ఇజ్రాయెల్ తో సహా అనేక గల్ఫ్ దేశాలపై మిస్సైళ్ళు, డ్రోన్లతో విరుచుకుపడుతుంది.
ఈ పరిణామాల నేపథ్యంలో ప్రధానమంత్రి మోదీ నెతన్యాహుతో మాట్లాడారు. ఆదివారం రాత్రి ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూతో ఫోన్‌లో మాట్లాడారు. అనంతరం మోదీ స్పందిస్తూ నెతన్యాహూతో ప్రాంతీయ పరిస్థితులపై మాట్లాడినట్లు వెల్లడించారు.
ఇటీవలి నెలకొన్న పరిణామాలపై ప్రధాని నెతన్యాహుతో ఆందోళన వ్యక్తం చేశారు. పౌరుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని నొక్కిచెప్పారు. శత్రుత్వాలు ముగించాలని పునరుద్ఘాటించారు. అంతకంటే ముందు ప్రధాని మోదీ యుఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్‌తో మాట్లాడి, ఆ దేశంపై ఇరాన్ చేసిన దాడులను తీవ్రంగా ఖండించారు.










