– పార్లమెంట్ భద్రత వైఫల్యంపై తొలిసారి స్పందించిన మోదీ!
PM Narendra Modi | భారత పార్లమెంట్ పై ఉగ్రదాడి జరిగి 22 ఏళ్లు పూర్తయిన డిసెంబర్ 13నే ఇద్దరు ఆగంతకులు పార్లమెంట్ లోని విసిస్టర్స్ గ్యాలరీ నుండి సభలోకి దూకి కలర్ స్మోక్ వదిలారు. పార్లమెంట్ బయట మరో ఇద్దరు కూడా ఇలానే చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఈ నేపథ్యంలో పార్లమెంట్ లో భద్రతా వైఫల్యంపై దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. కాగా ఈ ఘటనపై స్పందించారు ప్రధాని మోదీ. ఒక హిందీ మీడియా సంస్థ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ. పార్లమెంట్ లో జరిగిన ఘటనను ఏ మాత్రం తక్కువ అంచనా వేయకూడదన్నారు.
ఈ ఘటన వెనుక ఉన్న అంశాలను, ఉద్దేశ్యలను లోతుగా వెళ్లి పరిశీలించాలని తెలిపారు ప్రధాని. స్పీకర్ ఓం బిర్లా విచారణకు అదేశించారని, దర్యాప్తు సంస్థలు వేగంగా విచారణను చేస్తున్నాయని పేర్కొన్నారు.
అలాగే ప్రతిపక్షాలు ఈ ఘటనపై అనవసరపు రాద్ధాంతం చేయకూడదని కోరారు. ఇదిలా ఉండగా విసిటర్స్ కు పాసులు జారీ చేసే సమయంలో అదనపు జాగ్రత్తలు తీసుకోవాలని ఎంపీలకు లేఖలను రాసారు స్పీకర్ ఓం బిర్లా.