Pawan Kalyan Second Most Searched Actor In The World | ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ( Deputy Cm Pawan Kalyan ) అరుదైన ఘనత సొంతం చేసుకున్నారు.
ప్రపంచంలోనే మోస్ట్ సెర్చడ్ యాక్టర్ ( Most Searched Actor ) కేటగిరిలో పవర్ స్టార్ రెండవ స్థానంలో నిలిచారు. ఈ మేరకు గూగుల్ సెర్చ్ ట్రెండ్స్ 2024 విడుదల అయ్యింది. ఇందులో అమెరికన్ స్టాండ్ అప్ కమెడియన్, యాక్టర్ ‘కట్ విలియమ్స్’ ( Katt Williams ) తొలి స్థానంలో నిలవగా, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ సెకండ్ ప్లేస్ ను కైవసం చేసుకున్నారు.
2024లో జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో జనసేన పార్టీ 100శాతం స్ట్రైక్ రేట్ ( Strike Rate ) ను సాధించింది. దింతో పవన్ పేరు దేశ వ్యాప్తంగా మారుమోగింది. ఈ క్రమంలో ఇండియా, నేపాల్, కువైట్, యూఏఈ, కతర్ వంటి దేశాల్లో పవన్ పేరును అత్యధికంగా సెర్చ్ చేశారు.
పవన్ కళ్యాణ్ సినీ రాజకీయ ప్రయాణం మరియు ఆయన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చెప్పడంతో జనసేనాని గురించి తెలుసుకునేందుకు నెటిజన్లు ఆసక్తి కనబరిచారు.
మరీ ముఖ్యంగా ‘ పవన్ కళ్యాణ్ పోర్టుఫోలియో’ ( Pawan Kalyan Portfolio ), ‘ పవన్ కళ్యాణ్ మినిస్ట్రీ ఇన్ ఏపీ ‘ ( PK Ministry In AP ), ‘ పిఠాపురం ‘ ( Pitapuram ) , ‘ పవన్ కళ్యాణ్ ఎలక్షన్ రిజల్ట్స్ ‘ ( Pawan Kalyan Election Results ) వంటి టాపిక్స్ ను అత్యధికంగా సెర్చ్ చేశారు.