Friday 11th July 2025
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > పెళ్లికాని జంటలకు షాకిచ్చిన OYO

పెళ్లికాని జంటలకు షాకిచ్చిన OYO

OYO Changes Policy | ప్రముఖ హోటల్ అగ్రిగేటర్ ఓయో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకనుండి పెళ్లికాని జంటలకు రూమ్ బుక్ చేసుకునే అవకాశం ఉండదని స్పష్టం చేసింది.

ఈ మేరకు 2025 సంవత్సరానికి గాను నూతన చెక్ ఇన్ పాలసీని తీసుకొచ్చింది. ఆదివారం కొత్త మార్గదర్శకాలను ఓయో ప్రకటించింది. ఈ పాలసీ ప్రకారం పెళ్లికాని జంటలకు రూమ్ ఇవ్వరు.

ఇకపై ఆన్లైన్ లో లేదా ఆఫ్లైన్ లో ఓయో హోటల్స్ లో రూమ్ బుక్ చేసుకోవాలనే జంటలు తమ పెళ్లి చెల్లుబాటు అయ్యే పాత్రలను లేదా రుజువుని సమర్పించాల్సి ఉంటుంది. ఈ కొత్త నిబంధనలను తొలుత మేరట్ లో అమలుకానున్నాయి.

అనంతరం వచ్చిన స్పందన ద్వారా మరిన్ని నగరాలకు దీన్ని విస్తరిస్తారు. ఫ్యామిలీస్ , స్టూడెంట్స్, ఒంటరిగా ప్రయాణించే వారికి మెరుగైన సేవలను అందించే ఆలోచనతో ఓయో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

You may also like
‘తెలంగాణ వచ్చి దశాబ్ధం దాటినా..యువకుల ఆత్మహత్యలు ఆగడం లేదు’
‘అన్యమతస్థులను తొలగించండి..టీటీడీకి బండి విజ్ఞప్తి’
‘తెలుగు భాష అమ్మ..హిందీ మన పెద్దమ్మ’
రాజాసింగ్ రాజీనామాకు బీజేపీ ఆమోదం

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions