Sunday 11th May 2025
12:07:03 PM
Home > తెలంగాణ > కొత్త మంత్రుల కోసం ఛాంబర్లను సిద్ధం చేస్తున్న అధికారులు.. సచివాలయం నేమ్ బోర్దుల తొలగింపు

కొత్త మంత్రుల కోసం ఛాంబర్లను సిద్ధం చేస్తున్న అధికారులు.. సచివాలయం నేమ్ బోర్దుల తొలగింపు

Officials Secretariat preparing chambers for new ministers.

-అసెంబ్లీకి రంగులు వేస్తున్న వైనం
-ఈ సాయంత్రం కొత్త సీఎం ప్రమాణ స్వీకారం చేసే అవకాశం

తెలంగాణ :తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు సర్వం సిద్ధమవుతోంది. సచివాలయం, అసెంబ్లీలను కొత్త ప్రభుత్వం కోసం సిద్ధం చేస్తున్నారు. సెక్రటేరియట్ లో పాత నేమ్ ప్లేట్లను తొలగించారు. కొత్త మంత్రుల కోసం ఛాంబర్లను సిద్ధం చేస్తున్నారు. సిబ్బందిని కూడా ఏర్పాటు చేసే పనిలో ఉన్నారు. మరోవైపు ఈ సాయంత్రం కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 9వ తేదీన భారీ స్థాయిలో విజయోత్సవ సభను నిర్వహించనున్నారు. కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ సచివాలయంలోకి ఎవరైనా వచ్చేలా చేస్తామని తెలిపారు. ప్రగతి భవన్ ను ప్రజా భవన్ గా చేస్తామని చెప్పారు. ఇంకోవైపు అసెంబ్లీకి కూడా కొత్త రంగులు వేస్తున్నారు.

You may also like
‘దేశ రక్షణ నిధికి ఏపీ స్పీకర్ విరాళం’
‘పాక్ కు లోన్..IMF పై విరుచుకుపడ్డ ఒవైసీ’
‘భారత్-పాక్ ఉద్రిక్తతలు..డోనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన’
‘పాక్ లో పట్టుబడ్డ భారత పైలట్..నిజం ఏంటంటే!’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions