Nitish Kumar Reddy Meets Cm Chandrababu | బోర్డర్-గావస్కర్ ( Border-Gavaskar ) ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియా ( Australia ) గడ్డపై అదరగొట్టిన తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిశారు.
గురువారం రాష్ట్ర సచివాలయంలో తనను కలిసిన నితీష్ ను సీఎం అభినందించారు. ఆస్ట్రేలియా పై సెంచరీ చేయడం ద్వారా నితీష్ తెలుగువారు సత్తాను ప్రపంచానికి చాటారని కొనియాడారు.
భవిష్యత్ లో నితీష్ మరిన్ని విజయాలు అందుకోవాలని ఆశించారు. అలాగే రాష్ట్రం నుండి మంచి క్రికెట్ ప్లేయర్లు రావాలన్నారు. అనంతరం ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తరఫున ప్రకటించిన రూ.25 లక్షల చెక్కును నితీష్ కు అందజేశారు.
మరోవైపు గురువారం రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ( Nara Lokesh ) ను నితీష్ కుమార్ రెడ్డి కలిశారు. ఈ సందర్భంగా యువ క్రికెటర్ ను సన్మానించి వెంకటేశ్వరస్వామి విగ్రహాన్ని బహుకరించారు.