Sunday 29th March 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > వందేమాతరం తప్పనిసరి.. కేంద్ర కొత్త మార్గదర్శకాలు!

వందేమాతరం తప్పనిసరి.. కేంద్ర కొత్త మార్గదర్శకాలు!

vande mataram

New Guidelines for Vande Mataram | భారత జాతీయ గేయం (Nantional Song) వందేమాతరం (Vande mathram) 150వ వార్షికోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ‘వందేమాతరం’ గేయాన్ని అన్ని ప్రభుత్వ కార్యక్రమాలు, అన్ని పాఠశాలల్లో తప్పనిసరి చేస్తూ కేంద్ర హోంమంత్రిత్వ శాఖ బుధవారం కొత్త నిబంధనలు విడుదల చేసింది.

జాతీయ గీతం ‘జనగణమన’ (National Anthem) కంటే ముందు వందేమాతరంను కచ్చితంగా ఆలపించాలని ఈ నిబంధనలలో పేర్కొంది. వందేమాతర గీతం ఆలపించినప్పుడు అందరూ నిలబడాలని పేర్కొంది.

అన్ని జాతీయ పురస్కారాలు ప్రదానం చేసే సమయంలో, రాష్ట్రపతి హాజరయ్యే అన్ని కార్యక్రమాల్లో వందేమాతరం ఆలపించాలని ఆదేశించింది. 1937లో తొలగించిన నాలుగు చరణాలతో కలిపి మొత్తం ఆరు చరణాలను పాడాలని కేంద్రం వెల్లడించింది.

జాతీయ గీతం, గేయం ఆలపిస్తుండగా అంతరాయం కలిగించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు తెలిపింది. సినిమా హాల్స్ వంటి ప్రదేశాల్లో కూడా దీనిని తప్పనిసరి చేసింది. కానీ ఆ సందర్భంగా లేచి నిలబడటం నుంచి మినాహాయింపు ఇచ్చింది.  

You may also like
nimisha priya
యెమెన్ లో కేరళ నర్సు ఉరిశిక్షపై కేంద్రం కీలక వ్యాఖ్యలు!
rashmika mandanna
హీరోయిన్ రష్మికకు కొత్త బాధ్యతలు అప్పగించిన ప్రభుత్వం!
kishan reddy slams tg assembly speaker
విశాఖ స్టీల్ ప్లాంట్, సింగరేణి ప్రైవేటీకరణపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హాట్ కామెంట్స్!
Modi Cabinet 3.O
Modi Cabinet 3.O: మంత్రులకు కేటాయించిన శాఖలివే!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions