Saturday 31st January 2026
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > ఒక్కరోజులోనే 105 అభివృద్ధి పనులు..అభినందించిన లోకేశ్

ఒక్కరోజులోనే 105 అభివృద్ధి పనులు..అభినందించిన లోకేశ్

Nara Lokesh Praises Kotam Reddy | నెల్లూరు రూరల్ ( Nellore Rural ) నియోజకవర్గ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కొత్త వరవడికి శ్రీకారం చుట్టారు. ఒక్కరోజులోనే 105 అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశీస్సులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసినట్లు కోటంరెడ్డి పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో మంత్రి నారా లోకేశ్ స్పందించారు. ఒకేరోజు 105 అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి ఎమ్మెల్యే కోటంరెడ్డి రికార్డు సృష్టించారని లోకేశ్ కొనియాడారు.

బహుశా దేశ, రాష్ట్ర చరిత్రలో ఇదొక అరుదైన ఘట్టమని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నేతృత్వంలోని ప్రగతిశీల ప్రభుత్వం అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యతనిస్తుంది అనడానికి ఇదొక ఉదాహరణ అని పేర్కొన్నారు.

ప్రజాప్రతినిధులకు స్పూర్తిగా ఎమ్మెల్యే నిలిచారని ప్రశంసిస్తూ కోటంరెడ్డికి మంత్రి అభినందనలు తెలియజేశారు. మంత్రి లోకేశ్ అభినందనల నేపథ్యంలో కోటంరెడ్డి స్పందించారు. అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు కు, ప్రోత్సహిస్తున్న నారా లోకేశ్ కు ధన్యవాదాలు తెలిపారు.

ఇదే నిబద్ధతతో భవిష్యత్ లో కూడా నెల్లూరు రూరల్ ప్రజల సమస్యల పై మరింత అంకిత భావంతో పని చేస్తానని కోటంరెడ్డి భరోసా ఇచ్చారు.

You may also like
ఎన్నికల బరిలో గల్వాన్ వీరుడు సంతోష్ బాబు తల్లి
కేసీఆర్ ఇంటి గోడకు సిట్ నోటీసులు..కేటీఆర్ కన్నెర్ర
బంగారం, వెండి ధరలు పతనానికి కారణం ఈయనే!
రష్యన్ అమ్మాయిలతో సెక్స్..బిల్ గేట్స్ కు రోగం?

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions