Vangalapudi Anitha Latest News | ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత గొప్ప మనసు చాటుకున్నారు. టీడీపీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో తనను గృహ నిర్బంధంలో ఉంచిన పోలీసుకు నేడు సీమంతం చేశారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా హోం మంత్రి అనిత నూతన సాంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. పోలీసుశాఖలో కింది. స్థాయిలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులు ఇంటికి వెళ్లి వారి యోగ క్షేమాలు తెలుసుకున్నారు.
ఇందులో భాగంగా శనివారం విశాఖపట్నం లోని ఎంవీపీ కాలనీ పోలీసు స్టేషన్ మహిళా కానిస్టేబుల్ రేవతి ఇంటికి వెళ్లారు. రెండేళ్ల క్రితం ఉద్యోగంలో చేరిన రేవతి ప్రస్తుతం గర్భిణి. ఆమె శివజీపాలెం లో ఉంటున్నారు. హోంమంత్రి అనిత తమ ఇంటికి రావడంతో రేవతి మరియు ఆమె కుటుంబ సభ్యులు ఆశ్చర్యపోయారు.
అనంతరం కుటుంబ యోగ క్షేమాలు తెలుసుకున్న అనిత, మహిళా కానిస్టేబుల్ కు సీమంతం చేసి ఆశీర్వదించారు. దింతో రేవతి భావోద్వేగానికి లోనవగా, హోంమంత్రి ఆమె హత్తుకుని ఓదార్చారు. ఈ సందర్భంగా ఓ కీలక సంఘటనను అనిత గుర్తు చేసుకున్నారు.
గతంలో తాను టీడీపీ మహిళా అధ్యక్షురాలిగా బాధ్యతలు నిగతంలో తాను టీడీపీ మహిళా అధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వహిస్తున్న సమయంలో ఒకరోజు ఎంవీపీ పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారని, ఈ సమయంలో రేవతి తన ర్వహిస్తున్న సమయంలో ఒకరోజు ఎంవీపీ పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారని, ఈ సమయంలో రేవతి తన ఇంటికి వచ్చి హౌస్ అరెస్ట్ డ్యూటీలో ఉన్నట్లు అనిత గుర్తుచేసుకున్నారు.