Thursday 7th August 2025
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > చాలా పెద్ద తప్పు చేశావ్ తమ్ముడు..ఐ మిస్ యూ : నారా లోకేష్

చాలా పెద్ద తప్పు చేశావ్ తమ్ముడు..ఐ మిస్ యూ : నారా లోకేష్

Nara Lokesh Emotional Post On TDP Activist Srinu Suicide | తెలుగుదేశం పార్టీ కార్యకర్త శ్రీను ఆత్మహత్య చేసుకోవడం పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు మంత్రి నారా లోకేష్.

అన్నా.. అన్నా… అని పిలిచేవాడు, ఎవరికి ఏ కష్టం వచ్చినా సహాయం చేయాలని మెసేజ్ చేసేవాడు, తన పుట్టినరోజు, పెళ్లి రోజులను ఓ పండగలా జరిపేవాడు, కానీ నీకు ఆపద వస్తే ఈ అన్నకి ఒక్క మెసేజ్ చేయాలనిపించలేదా? దిద్దలేని చాలా పెద్ద తప్పు చేశావు తమ్ముడు, ఐ మిస్ యూ ( I Miss You )అంటూ నారా లోకేష్ ఎమోషనల్ అయ్యారు.

‘ఆత్మాభిమానం ఉండొచ్చు. ఆత్మ..హత్య చేసుకునేంతగా కాదు. నువ్వు బలవన్మరణానికి పాల్పడిన విచారకర సంఘటన సోషల్ మీడియా ( Social Media ) ద్వారా తెలుసుకున్న వెంటనే, నిన్ను బతికించుకునేందుకు చేయని ప్రయత్నం లేదు. సారీ శీను..నీకున్న కష్టమేంటో నాకు ఎప్పుడూ చెప్పలేదు. నీకు కలిగిన నష్టమేంటో ఏ రోజూ నాకు తెలియనివ్వలేదు. నువ్వు లేవు కానీ నీ కుటుంబానికి నేనున్నాను.. మీ అన్నగా ఆ కుటుంబానికి అండగా ఉంటూ నీ బాధ్యతల్ని నేను నెరవేరుస్తాను.’ అని హామీ ఇచ్చారు.

ఈ సందర్భంగా టీడీపీ కార్యకర్తలు, అభిమానులు, సోషల్ మీడియా యాక్టివిస్టు ( Activist )లకు లోకేష్ ఒక విన్నపం చేశారు. అప్పులో, అనారోగ్యమో, ఆత్మాభిమానమో, కుటుంబ సమస్యలో ఏమైనా కానివ్వండి.. కుటుంబం, స్నేహితులు, బంధువులు, పార్టీలో హితులు.. ఎవరితోనైనా షేర్ చేసుకోండి.

ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది. బతికి ఉందాం.. మరికొందరిని బతికించుకుందాం.. దయచేసి ఇటువంటి తప్పుడు నిర్ణయాలు ఎవ్వరూ తీసుకోవద్దని మంత్రి ఎక్స్ ( X ) వేదికగా పోస్ట్ చేశారు.

You may also like
‘బీసీలకు 42% రిజర్వేషన్లు..తెలంగాణ తడాఖా చూపిస్తాం’
‘నేను ప్రమోట్ చేసింది బెట్టింగ్ యాప్ కాదు’
ధనుష్-మృణాల్ డేటింగ్ లో ఉన్నారా?
లార్డ్స్ మైదానంలో ‘నక్క పరుగులు’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions