Saturday 28th February 2026
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > బస్సులో ఉచిత ప్రయాణం..మహిళను సర్ప్రైజ్ చేసిన నారా భువనేశ్వరి

బస్సులో ఉచిత ప్రయాణం..మహిళను సర్ప్రైజ్ చేసిన నారా భువనేశ్వరి

Nara Bhuvaneswari News | ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి భువనేశ్వరి కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా పలు కార్యక్రమాల్లో ఆమె పాల్గొన్నారు. తాజగా ఆర్టీసీ బస్సులో మహిళలతో కలిసి ప్రయాణించిన భువనేశ్వరి ఉచిత ప్రయాణ పథకాన్ని వినియోగించుకున్నారు. ఆధార్ కార్డు చూపించి, ఫ్రీ టికెట్ పొంది, శాంతిపురం నివాసం నుంచి తుమ్మిసి వరకూ బస్సులో ప్రయాణించారు. ఈ సమయంలో మహిళలతో మాట్లాడి ఉచిత బస్సు ప్రయాణం గురించి తెలుసుకున్నారు.

అనంతరం ఓ మహిళా కార్యకర్త ఇంటికి వెళ్లి ఆమెను సర్ప్రైజ్ చేశారు. కుప్పం పర్యటనలో భాగంగా భువనేశ్వరి మొదటి రోజు శాంతిపురం మండలం చెల్దిగానిపల్లిలో పర్యటించారు. ఈ సందర్భంగా నారా భువనేశ్వరిని కలిసిన లక్ష్మమ్మ అనే మహిళ తమ ఇంటికి రావాల్సిందిగా ఆహ్వానించారు. తప్పకుండా వస్తానని చెప్పిన భువనేశ్వరి తాజగా లక్ష్మమ్మ ఇంటికి వెళ్లి సర్ ప్రైజ్ చేశారు. దింతో లక్ష్మమ్మ కుటుంబసభ్యుల ఆనందం వ్యక్తం చేశారు. భువనేశ్వరిని సాదరంగా స్వాగతించి చీరను బహుకరించారు. వారి యోగక్షేమాలు కనుక్కుని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఎలా అందుతున్నాయో భువనేశ్వరి అడిగి తెలుసుకున్నారు. అనంతరం అల్పాహరం తీసుకుని శాంతిపురంలోని నివాసానికి బయలుదేరి వెళ్లారు.

You may also like
ఇరాన్ పై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్..ఏం జరగనుందో!
GHMC చట్టం స్థానంలో కోర్ అర్బన్ చట్టం
బల్కంపేట ఆలయంలో మంత్రి ఆకస్మిక తనిఖీ..అధికారులపై వేటు
బొత్సకు బ్రెయిన్ స్ట్రోక్..స్పందించిన పవన్

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions