Nagababu Set To Join Andhra Pradesh Cabinet | ఆంధ్రప్రదేశ్ లోని కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.
జనసేన ప్రధాన కార్యదర్శి, మెగా బ్రదర్ ( Mega Brother ) నాగబాబు ( Nagababu ) ను రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకోనున్నారు. ఈ మేరకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ( Deputy Cm Pawan Kalyan ) మంతనాలు జరిపినట్లు తెలుస్తోంది. దింతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాగబాబు ను క్యాబినెట్ ( Cabinet ) లోకి తీసుకోవాలని నిర్ణయించారు.
తొలుత నాగబాబు రాజ్యసభ కు వెళ్తారని ప్రచారం జరిగింది. కానీ ఖాళీ అయిన మూడు స్థానాలకు టీడీపీ నుండి బీద మస్తాన్ రావు, సతీష్ బాబు బీజేపీ నుండి ఆర్. కృష్ణయ్య ( R Krishnaiah ) పేర్లు ఖరారు అయ్యాయి.
ఈ నేపథ్యంలో నాగబాబు ను మంత్రివర్గంలోకి తీసుకొనున్నారు. కాగా మంత్రివర్గంలోకి తీసుకున్నాక ఎమ్మెల్సీని చేస్తారా లేదా ఎమ్మెల్సీ చేశాక మంత్రిని చేస్తారా అనేది తెలియాల్సి ఉంది.