Mohan Babu News Latest | మంచు కుటుంబంలో తలెత్తిన విభేదాలు రోడ్డున పడడం సంచలనంగా మారింది.
కుటుంబ పెద్ద మోహన్ బాబు తనయుడు మంచు మనోజ్ ( Manchu Manoj ) మరియు ఆయన సతీమణి మౌనిక పై ఫిర్యాదు చేశారు. వారి నుంచి తనకు ప్రాణహాని ఉందని ఫిర్యాదులో మోహన్ బాబు పేర్కొనడం పెను దుమారాన్ని రేపింది.
అసలు కుటుంబంలో గోడవలకు కారణం ఏంటి అనే దానిపై మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. మరోవైపు మంచు విష్ణు, మనోజ్ ల బౌన్సర్లు జల్ పల్లి ( Jalpalli ) నివాసం వద్ద గొడవకు దిగారు. ఇదిలా ఉండగా మోహన్ బాబుకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది.
ఈ వీడియోలో మోహన్ బాబు కుర్చీపై కూర్చోగా చుట్టూ మనుషులు ఉన్నారు. ఇదే సమయంలో ఓ సెక్యూరిటీ గార్డ్ ఒక వ్యక్తిని కొట్టి అతడి వద్దనుండి ఫోన్ లాక్కున్నారు, అలాగే మరో వ్యక్తి చెంపను చెల్లుమనిపించారు.
ఈ తతంగాన్ని మొత్తం కుర్చీలో కూర్చున్న మోహన్ బాబు చూస్తూనే ఉన్నారు, పెదరాయుడు తరహాలో మోహన్ బాబు పంచాయతీ చేస్తున్న వీడియో తీవ్ర చర్చకు తీస్తుంది.