Mohan Babu Grand Daughters In Kannappa Movie | కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ( Mohan Babu ) మనవరాళ్లు యాక్టింగ్ ( Acting ) లోకి ఎంట్రీ ఇచ్చారు. తండ్రి మంచు విష్ణు ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ‘ కన్నప్ప ‘ సినిమా ద్వారా వీరు వెండితెరకు పరిచయం కానున్నారు.
ఈ మేరకు మూవీ నుండి అరియాన ( Ariaana ), వివియాన ( Viviana ) లకు సంబంధించిన పోస్టర్ ను మోహన్ బాబు రిలీజ్ ( Release ) చేశారు. కన్నప్పతో తన మనవరాళ్లు ఇండస్ట్రీలోకి అడుగుపెడుతుండడం సంతోషంగా ఉందన్నారు మోహన్ బాబు.
యాక్టింగ్ పై వారికి ఉన్న అభిరుచి తనకు గర్వంగా ఉందని పేర్కొన్నారు. ఇండస్ట్రీలో వారికి మంచి గుర్తింపు రావాలని ఆశించారు. ఇకపోతే కూతుర్ల అరంగేట్రం పై తండ్రి మంచు విష్ణు స్పందించారు.
కన్నప్ప మూవీలో తన కూతుర్లు నటిస్తున్నందుకు ఆనందంగా ఉందన్నారు. మరోవైపు ఇదే సినిమాలో మంచు విష్ణు కుమారుడు అవ్రామ్ ( Avraam ) కూడా నటిస్తున్నారు.