Minister Seethakka News Latest | మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న ఉమెన్ హెల్ప్ లైన్ కాల్ సెంటర్ ( Women’s Helpline Call Center ) ను సోమవారం ఆకస్మికంగా సందర్శించారు మంత్రి సీతక్క.
అనంతరం 181 నంబర్ ద్వారా వచ్చిన ఫోన్ కాల్ కు సీతక్క అటెండ్ ( Attend ) చేసి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ క్రమంలో తన భర్త వేధిస్తున్నాడని దేవరకొండ నుంచి ఓ యువతి ఫోన్ చేసింది. తనను, తన ఇద్దరు పిల్లలను ఇంటి నుంచి బయటకు పంపించారని మంత్రికి సదరు యువతి మొర పెట్టుకున్నారు.
యువతి ఫిర్యాదు పై సీతక్క స్పందించి సహాయం చేస్తామని తెలిపారు. యువతి భర్తకు కౌన్సిలింగ్ ఇస్తామని, వినకపోతే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఆ తర్వాత స్థానిక సఖీ కేంద్రం అధికారికి ఫోన్ చేసి యువతిని ఆదుకోవాలని ఆదేశించారు.










