Ram Charan-Upasana | మెగా ఫ్యామిలీలో మెగా ప్రిన్సెస్ (Mega Princess) అడుగుపెట్టంది. రామ్ చరణ్-ఉపాసన దంపతులకు మంగళవారం పండంటి ఆడబిడ్డ జన్మించింది.
నెలలు నిండటంతో ఉపాసన సోమవారం రాత్రి తన భర్త రామ్ చరణ్, తల్లి శోభన కామినేని, అత్త సురేఖతో కలిసి అపోలో హాస్పిటల్‌లో చేరారు.
మంగళవారం ఉదయం రామ్ చరణ్ ఉపాసన దంపతులకు పాప పుట్టినట్లు అపోలో ఆసుపత్రి ప్రకటన విడుదల చేసింది.

దీంతో మెగా కుటుంబంలో సంబరాలు మిన్నంటాయి. మరోవైపు మెగాభిమానులు కూడా చాలా సంతోష్యం వ్యక్తం చేస్తున్నారు. ఈమేరకు ట్విట్టర్ లో మెగా ప్రిన్సెస్ హ్యాష్ ట్యాగ్ తో వైరల్ చేస్తున్నారు.
రామ్ చరణ్ దంపతులకు ఆడబిడ్డ జన్మించడంతో మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) ఎమోషనల్ మెసేజ్‌ను తన సోషల్ మీడియాలో షేర్ చేశారు.
‘‘లిటిల్ మెగా ప్రిన్సెస్‌కి స్వాగతం. నీ రాకతో కోట్లాది మంది ఉన్న మెగా ఫ్యామిలీలో సంతోషం వెల్లివిరిసింది. నీ వల్ల రామ్ చరణ్, ఉపాసనలను తల్లిదండ్రులైతే, మేం గ్రాండ్ పేరెంట్స్ అయ్యాం. ఈ క్షణాలు చాలా సంతోషంగా గర్వంగా ఉన్నాయి’’ అంటూ మనవరాలి ఆగమనంపై చిరంజీవి భావోద్వేగంతో ట్వీట్ చేశారు.
చిరంజీవిగారి ట్వీట్‌పై మెగాభిమానులు రియాక్ట్ అవుతున్నారు. అభినందనలు తెలియజేస్తున్నారు. రామ్ చరణ్ ఉపాసన (Ram Charan-Upasana) దంపతులకు సినీ రాజకీయ ప్రముఖులు నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
రామ్ చరణ్, ఉపాసనలకు 2012లో వివాహం జరిగింది. పెళ్లయిన సుదీర్ఘ కాలం తర్వాత గతేడాది డిసెంబర్‌లో తాము తల్లిదండ్రులవుతున్నామని తెలియజేశారు రామ్ చరణ్ ఉపాసన. తాజాగా మెగా వారసురాలు ఇంట్లోకి అడుగు పెట్టింది.









