Mahesh Review On Sitare Jameen Par | బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ (Amir Khan) ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘సితారే జమీన్ పర్. జూన్ 20 థియేటర్లలో విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది.
తారే జమీన్ పర్ సినిమాకు సీక్వెల్ గా వచ్చిన ఈ చిత్రంలో మానసికం దివ్యాంగులకు ఓ కోచ్ బాస్కెట్ బాల్ క్రీడలో ట్రైనింగ్ ఇచ్చి, వాళ్లను మేటి ఆటగాళ్లుగా తీర్చిదిద్దే కథాంశంతో రూపొందింది. ఆమిర్ ఖాన్ ఇందులో కోచ్ గా నటించారు.
ఈ సినిమా నెట్టింట ప్రశంసలు అందుకుంటోంది. సచిన్ తెందుల్కర్, బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్ తదితరులు సినిమాను అద్భుతమంటూ కొనియాడారు. తాజాగా సూపర్ స్టార్ మహేశ్ బాబు కూడా సితారే జమీన్ పర్ చిత్రంపై తన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎక్స్ వేదికగా సినిమాపై పోస్ట్ పెట్టారు.
“అద్భుతమైన సినిమా. ఆమిర్ ఖాన్ ఇతర క్లాసిక్ సినిమాల మాదిరిగానే ‘సితారే జమీన్ పర్’ కూడా మిమ్మల్ని నవ్విస్తుంది, ఏడిపిస్తుంది, చప్పట్లు కొట్టేలా చేస్తుంది. ‘సితారే జమీన్ పర్ చూశాక కచ్చితంగా చిరునవ్వుతో బయటకు వస్తారు” అంటూ యూనిట్ ను అభినందించారు మహేశ్.