Lalit Modi releases Sreesanth–Harbhajan Singh’s rare video from slapgate incident | ఇండియన్ ప్రీమియర్ లీగ్ తొలి ఎడిషన్ లో జరిగిన ఓ సంఘటన అప్పట్లో కలకలం రేపింది.
2008 ఐపీఎల్ తొలి సీజన్ సందర్భంగా ముంబయి ఇండియన్స్-పంజాబ్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. మ్యాచ్ ముగిసిన అనంతరం ముంబయి బౌలర్ హర్భజన్ సింగ్, పంజాబ్ పేసర్ శ్రీశాంత్ ను చెంప దెబ్బ కొట్టాడు. ఆ సమయంలో ఈ ఘటన సంచలనంగా మారింది. అలాగే వివాదానికి దారి తీసింది.
తాజగా ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోదీ విడుదల చేశారు. ఈ మేరకు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైఖెల్ క్లార్క్ తో ఇంటర్వ్యూ సందర్భంగా లలిత్ మోదీ వీడియోను విడుదల చేశారు.
‘ మ్యాచ్ ముగిసింది. కెమెరాలు సైతం ఆఫ్ అయ్యాయి. అయితే నా సెక్యూరిటీ కెమెరా మాత్రం ఆన్ లో ఉంది. ఇందులోనే చెంపదెబ్బ వీడియో రికార్డు అయ్యింది. ప్లేయర్లు కరచాలనం చేసుకుంటున్న సమయంలో శ్రీశాంత్ చెంపపై భజ్జీ చాలా కోపంగా కొట్టాడు. ఈ ఘటన తర్వాత భజ్జీపై ఎనిమిది మ్యాచుల నిషేధం విధించాం’ అని లలిత్ మోదీ పేర్కొన్నారు. కాగా శ్రీశాంత్ ను కొట్టడంపై హర్భజన్ చాలా సార్లు బహిరంగంగా క్షమాపణలు చెప్పిన విషయం తెల్సిందే.










