Kumbh Mela Fame Actress Monalisa Telugu Movie | మహా కుంభమేళా సమయంలో తెగ వైరల్ గా మారిన తేనె కళ్ళ మోనలిసా టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. ఆమె హీరోయిన్ గా నటించబోతున్న సినిమా బుధవారం ప్రారంభం అయ్యింది. ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్రాజ్ లో ఈ ఏడాది మొదట్లో జరిగిన మహా కుంభమేళాలో ఓ తేనె కళ్ళ అమ్మాయి తెగ వైరల్ గా మారింది.
కుంభమేళాలో పూసలు, దండలు అమ్ముతూ ఆమె కనిపించడం ఆ తర్వాత ఆమె ఫోటోలు, వీడియోలు క్షణాల్లోనే వైరల్ గా మారాయి. ఈ క్రమంలో ఆమెకు బాలీవుడ్ దర్శకుడు సనోజ్ మిశ్ర తొలుత మూవీ ఛాన్స్ ఇచ్చారు. ఆ తర్వాత ఆమె మలయాళం మూవీలో నటించనున్నట్లు కథనాలు వెలువడ్డాయి. తాజగా కుంభమేళా మోనాలిసా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.
నటుడు సాయి చరణ్ హీరోగా, దర్శకుడు శ్రీను కోటపాటి తెరకెక్కిస్తున్న మూవీలో మోనాలిసా హీరోయిన్ గా నటిస్తుంది. బుధవారం ఈ మేరకు జరిగిన మూవీ లాంచ్ ఈవెంట్ లో పాల్గొని సందడి చేసింది. ‘లైఫ్’ అనే టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. పాన్ ఇండియా స్థాయిలో ఈ మూవీని విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.









