Friday 22nd November 2024
12:07:03 PM
Home > తాజా > ఇప్పుడు ఉంది అసలు ఆట.. కాంగ్రెస్ సర్కార్ పై కేటీఆర్ విమర్శలు!

ఇప్పుడు ఉంది అసలు ఆట.. కాంగ్రెస్ సర్కార్ పై కేటీఆర్ విమర్శలు!

ktr pressmeet

KTR Chit Chat With Media | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బుధవారం మీడియా తో చిట్ చాట్ చేశారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. సాధ్యం కాని హామీలు ఇచ్చి ప్రజలను కాంగ్రెస్ మభ్య పెట్టిందని ఆరోపించారు.

కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏనాడూ పద్దు మీద చర్చ జరగలేదన్నారు. ప్రతి ఏడాది పీఏసీ, కాగ్ రిపోర్ట్స్ ఇస్తున్నామని చెప్పారు. ఏటా ఆడిట్ లెక్కలు తీస్తున్నామనీ, లెక్కలు వేసుకొని హామీలు ఇస్తారా?  హామీలు ఇచ్చి లెక్కలు వేసుకుంటారా? అని ప్రశ్నించారు.

మేం ప్రతి ఏడాది పద్దులపై శ్వేత పత్రం విడుదల చేశాం. రేపు గవర్నర్ ప్రసంగంలో ఇదే పాత చింతకాయ పచ్చడి చెప్తారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసి మాకు ఇచ్చారని చెప్తారు. ఓ ఎమ్మెల్యే మా నియోజకవర్గం లో 45 వేల ఉద్యోగాలు ఇస్తామని చెప్తున్నాడు.

ఎలా ఇస్తారు అంటే ఇస్తామని చెప్తున్నాడు. ఇచ్చిన హామీలు చాలా ఉన్నాయి. ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆ బరువు వాళ్లకు తెలియాలి. ఇప్పుడు ఉంది అసలు ఆట.

రెండు లక్షల రుణమాఫీ అధికారం లోకి వచ్చిన రెండు రోజుల్లోనే చేస్తానన్న రాహుల్ గాంధీ హామీ ఏమైంది? మొదటి మంత్రి వర్గం లోనే ఆరు గ్యారంటీ లకు చట్టబద్దత తెస్తమన్న హామీ ఎక్కడ? అని కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించారు.

You may also like
harish rao
ఇది 8 పర్సెంట్ గవర్నమెంట్.. హరీశ్ రావు విమర్శలు!
chamala kiran kumar reddy
“నీది రా కుట్ర…” కేటీఆర్ కు కాంగ్రెస్ ఎంపీ కౌంటర్!
vemula veeresham
టేబుల్ మీద వెపన్ పెట్టి బెదిరించారు: కాంగ్రెస్ ఎమ్మెల్యే!
పట్నం నరేందర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions