Kerala CM Fires On TG Govt | తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులుచెరిగారు కేరళ సీఎం పినరయి విజయన్ (CM Pinarayi Vijayan). ఖమ్మం వెలుగుమట్ల (Velugumatla) లోని భూదాన్ భూముల్లోని ఇళ్లను అక్రమ కట్టడాలు అని పేర్కొన్న అధికారులు వాటిని నేలమట్టం చేసిన విషయం తెల్సిందే.
ఈ కూల్చివేతలపై తాజగా కేరళ సీఎం పినరయి విజయన్ స్పందించారు. భూదాన్ భూముల్లో 700 ఇళ్లను కూల్చివేసి సుమారు 3000 మందిని నిరాశ్రుయులను చేయడం ద్వారా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం తన నిజస్వరూపాన్ని బయటపెట్టుకుందని ధ్వజమెత్తారు.
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పేదలపై ఏ విధంగా అయితే బుల్డోజర్ రాజ్ నడుస్తోందో కాంగ్రెస్ సర్కారు కూడా అదే విధానాన్ని అనుసరిస్తుందని దుయ్యబట్టారు. కేరళలో ప్రజలకు మద్దతుగా ఉంటామని చెప్పే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అణగారిన వర్గాలపై జరిగిన దాడికి సమాధానం చెప్పాలని కేరళ సీఎం డిమాండ్ చేశారు.










