Kalvakuntla Kavitha Gets Bail In Delhi Liquor Policy Case| బీఆరెస్ ఎమ్మెల్సీ, కేసీఆర్ తనయ కవితకు సుప్రీం కోర్టులో భారీ ఊరట లభించింది.
ఢిల్లీ మద్యం పాలసీ కేసుకు సంబంధించి కవితను మార్చి 15న ఈడీ అరెస్ట్ చేసిన విషయం తెల్సిందే. మార్చి 16 నుండి ఆమె తీహార్ జైలులో ఉన్నారు.
కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై మంగళవారం సర్వోన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. సుమారు గంటన్నర పాటు కవిత తరఫు లాయర్ ముకుల్ రోహాత్గి, ఈడీ తరఫు ఏఎస్జీ వాదనలు వినిపించారు.
జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ విశ్వనాథ్ తో కూడిన ద్విసభ్య ధర్మాసనం కవితకు బెయిల్ మంజూరు చేసింది. ఇప్పటికే బీఆరెస్ అగ్రనేతలు కేటీఆర్, హరీష్ రావు ఢిల్లీ చేరుకున్న విషయం తెల్సిందే.