Monday 28th April 2025
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > మెగాస్టార్ చిరంజీవితో కలిసి నటించనున్న కర్ణాటక ఎమ్మెల్యే

మెగాస్టార్ చిరంజీవితో కలిసి నటించనున్న కర్ణాటక ఎమ్మెల్యే

Karnataka MLA To Act With Chiranjeevi | కర్ణాటక ( Karnataka )కు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే ( Congress MLA ) మెగాస్టార్ చిరంజీవి ( Megastar Chiranjeevi )తో కలిసి నటించనున్నట్లు కథనాలు వస్తున్నాయి.

ఇదే విషయంపై చిక్కబళ్లాపుర ( Chikkaballapur ) ఎమ్మెల్యే ప్రదీప్ ఈశ్వర్ ( Pradeep Eshwar )మాట్లాడారు. చిరంజీవితో కలిసి నటించే అవకాశం రానున్నట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు ఇటీవల మీడియాతో మాట్లాడిన ఆయన తాను చిరంజీవికి పెద్ద అభిమానినని పేర్కొన్నారు.

కర్ణాటక ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచిన అనంతరం చిరంజీవి తన హైదరాబాద్ ( Hyderabad )నివాసానికి పిలిచి సన్మానించినట్లు గుర్తుచేశారు.

అలాగే ఏపీ ఎన్నికల్లో జనసేన ఘన విజయం పట్ల పవన్ కళ్యాణ్ ( Deputy Cm Pawan Kalyan ) కు ఫోన్ చేసి శుభాకాంక్షలు చెప్పినట్లు కాంగ్రెస్ ఎమ్మెల్యే మీడియాకు చెప్పారు.

ప్రస్తుతం చిరంజీవి ‘ విశ్వంభర ‘ ( Vishwambhara ) సినిమా చేస్తున్నారని, ఈ మూవీ తర్వాత మొదలయ్యే మరో మూవీలో మెగాస్టార్ తో కలసి తాను నటించనున్నట్లు కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రదీప్ ఈశ్వర్ క్లారిటీ ఇచ్చారు. అయితే ఈ సినిమాలో తన పాత్ర ఏమిటనేది త్వరలోనే తెలుస్తుందన్నారు.

You may also like
Chiranjeevi
ఆమే నా బలం.. చిరంజీవి ఆసక్తికర పోస్ట్!
స్వయంగా కారు నడుపుకుంటూ..మామ ఇంటికి అల్లు అర్జున్
థ్యాంక్యూ మెగాస్టార్..చిరంజీవితో కిరణ్ అబ్బవరం
సీఎం రేవంత్ ను కలిసిన మెగాస్టార్ చిరంజీవి

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions