Karimnagar and Nizamabad municipal corporations | తెలంగాణ కార్పోరేషన్ ఎన్నికల్లో నిజామాబాద్, కరీంనగర్ కార్పొరేషన్లు తీవ్ర ఉత్కంఠను రేపాయి. ఏ పార్టీకి స్పష్టమైన ఆధిక్యం రాలేదు. రెండు చోట్లా భారతీయ జనతా పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. కాగా మంగళవారం జరిగిన మేయర్ ఎన్నికలో నిజామాబాద్ మేయర్ పీఠాన్ని అధికార కాంగ్రెస్ దక్కించుకుంది. మరోవైపు కరీంనగర్ లో మాత్రం బీజేపీ కార్పొరేటర్ మేయర్ పీఠంపై కూర్చున్నారు. నిజామాబాద్ లో ఎంఐఎం మద్దతుగా కార్పోరేషన్ ను కాంగ్రెస్ పార్టీ దక్కించుకుంది.
దింతో మేయర్ గా ఉమారాణి, డిప్యూటీ మేయర్ గా సల్మా తెహసిన్ ఎన్నికయ్యారు. మరోవైపు కరీంనగర్ లో కేంద్రమంత్రి బండి సంజయ్ పకడ్బందీగా వ్యవహరించడంతో మేయర్ పీఠం బీజేపీ వశం అయ్యింది. ఆ పార్టీకి చెందిన కొలగాని శ్రీనివాస్ మేయర్ గా ఎన్నికయ్యారు. బీజేపీకి 34 మంది కార్పొరేటర్ల మద్దతు దక్కింది. అంతకంటే ముందు మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నించినా ఫలితం లేకుండాపోయింది.










