Kalvakuntla Himanshu Rao With KCR | బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ( KTR ) తనయుడు కల్వకుంట్ల హిమాన్షు రావు ( Kalvakuntla Himanshu Rao ) తన తాత కేసీఆర్ ( KCR ) వద్ద వ్యవసాయ పాటలు నేర్చుకుంటున్నారు.
దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. కేసీఆర్ ప్రస్తుతం ఎర్రవెల్లి ఫార్మ్ హౌస్ లో ఉన్న విషయం తెల్సిందే. ఈ క్రమంలో మనవడు హిమాన్షుకు మొక్క ఎలా నాటాలో కేసీఆర్ నేర్పించారు.
కేసీఆర్ చెబుతుండగా హిమాన్షు స్వయంగా పార చేతబట్టి గుంతను తీశారు, అనంతరం మొక్కను నాటి ఎరువులు వేసి నీళ్లు పోశారు. ‘లెర్నింగ్ ఫ్రమ్ ది బెస్ట్’ ( Learning From The Best ) అంటూ కేసీఆర్ ను ఉద్దేశించి హిమాన్షు పోస్ట్ చేశారు.
వాతావరణ మార్పులను తగ్గించడానికి అటవీ పెంపకం ముఖ్యమని, సహజ వనరులని రక్షించడం, సంరక్షించడం మన బాధ్యత అంటూ హిమాన్షు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా విదేశాల్లో హిమాన్షు తన విద్యను కొనసాగిస్తున్న విషయం తెల్సిందే.