Jr NTR Sustains Injury During Shoot | జూనియర్ ఎన్టీఆర్ కు గాయం అయ్యింది. శుక్రవారం హైదరాబాద్ లో ఓ యాడ్ షూటింగ్ లో పాల్గొన్న సమయంలో ఆయన కాలికి స్వల్ప గాయం అయ్యింది. యాక్షన్ సీన్ షూట్ చేస్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది.
వెంటనే సిబ్బంది ఎన్టీఆర్ ను స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించింది. ఈ నేపథ్యంలో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దింతో ఎన్టీఆర్ గాయం పై ఆయన టీం ప్రకటన విడుదల చేసింది. యాడ్ షూటింగ్ సమయంలో ఎన్టీఆర్ కాలికి స్వల్ప గాయం అయ్యిందని, ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నారని పేర్కొంది.
అభిమానులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపింది. రెండు వారాల పాటు ఎన్టీఆర్ విశ్రాంతి తీసుకోనున్నట్లు వెల్లడించింది. అలాగే ఎన్టీఆర్ కు గాయం అయిన క్రమంలో సోషల్ మీడియాలో ఆయన ఆరోగ్యంపై జరిగే ప్రచారంపై ఎవరూ నమ్మొద్దని కోరింది.









