Jani Master News Latest | ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.
‘ తమ సొంత లాభం కోసం కోర్టు ఆర్డర్ల పై కూడా తప్పుడు ప్రచారాలు చేసేవారిని చూస్తుంటే జాలేస్తుంది. ముందస్తుగా నాకు తెలియకుండా జరిగిన యునియన్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ గురించి నేను పెట్టిన కేసుకి సంబంధించి వచ్చిన తీర్పుని మీకు అనుకూలంగా, నచ్చినట్టుగా మార్చి మరో కేసుతో ముడిపెట్టి పోస్టులు పెడుతూ ఉన్నారు. మీరేది చెప్పినా ప్రజలు నమ్ముతారనుకుంటున్నారేమో కానీ అసలు తీర్పు వివరాలు బయటకి వచ్చిన రోజున మీ నిజస్వరూపమేంటో, దేనికోసం ఈ దుష్ప్రచారం చేస్తున్నారని అందరికీ అర్థమవుతుంది. ఆ రోజు ఎంతో దూరం లేదు. న్యాయమే గెలుస్తుంది, నిజం అందరికీ తెలుస్తుంది’ అంటూ ఆయన పోస్ట్ చేశారు.
అయితే ఇది ఎవర్ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలో అనేది మాత్రం చెప్పలేదు. కాగా లైంగిక ఆరోపణలతో గతేడాది జానీ మాస్టర్ ఆరెస్టయిన విషయం తెల్సిందే.