Janasena Leader Suspended For Organising Rave Party | పుట్టినరోజు పార్టీతో ఓ నేత రెచ్చిపోయాడు. మందు విందే కాకుండా యువతులతో అశ్లీల నృత్యాలు ఏర్పాటు చేయించాడు.
దింతో తీవ్రంగా స్పందించిన జనసేన పార్టీ సదరు నేతను సస్పెండ్ చేసింది. వివరాల్లోకి వెళ్తే ఏలూరు జిల్లా నిడమర్రు మండలం క్రొవ్విడికి చెందిన జనసేన పార్టీ అధ్యక్షుడు వాకమూడి ఇంద్రకుమార్ ఈ నెల 15న పుట్టినరోజు జరుపుకున్నారు.
ఆరోజు సాయంత్రం స్థానిక రైస్ మిల్లులో సన్నిహితులకు, పార్టీ నేతలకు విందు ఇచ్చాడు. అక్కడికి వచ్చిన వారు భోజనాలు చేసి వెళ్లిపోయారు. అనంతరం అసలు తతంగం మొదలుపెట్టారు. కొందరు యువతులను పిలిపించి రైస్ మిల్లులోనే అసభ్యంగా ప్రవర్తించారు.
యువతులు నగ్నంగా నృత్యాలు చేస్తుంటే యువకులు రెచ్చిపోయారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. వెంటనే స్పందించిన పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ విషయం తెలుసుకున్న జనసేన అధిష్టానం ఇంద్రకుమార్ ను పార్టీ నుండి సస్పెండ్ చేసింది.