Jana Nayagan Audio Launch | కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ (Vijay) నటిస్తున్న తాజా చిత్రం ‘జన నాయగన్’ (Jana Nayagan).
ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదల కానుంది. విజయ్ రాజకీయాల్లోకి ప్రవేశించిన నేపథ్యంలో ఇది తన చివరి చిత్రం అని ఆయన ప్రకటించారు.
దీంతో ఈ సినిమాపై చాలా అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో తాజాగా మలేసియా వేదికగా జననాయగన్ ఆడియో లాంచ్ కార్యక్రమం జరిగింది.
అయితే ఈ ఈవెంట్ అరుదైన ఘనత సాధించింది. ఈ ఆడియో లాంచ్ ఈవెంట్ కు ప్రపంచం నలుమూలల నుంచి 85,000 మందికి పైగా విజయ్ అభిమానులు తరలివచ్చారు.
భారతదేశం వెలుపల జరిగిన తమిళ సినిమా ఆడియో విడుదలకు ఇంత భారీగా జనం రావడం ఇదే తొలిసారి. దీంతో ఈ ఈవెంట్ మలేసియా బుక్ ఆఫ్ రికార్డులో అధికారికంగా చేరింది.
హెచ్.వినోద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయ్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నట్లు తెలుస్తోంది.
ఆయన సరసన పూజా హెగ్దే కథానాయిక. మమిత బైజు, ప్రియమణి, బాబీ డియోల్, ప్రకాశ్ రాజ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.






