Is Mahira Sharma Dating Siraj ?| టీం ఇండియా స్టార్ బౌలర్, హైదరాబాద్ ప్లేయర్ మహ్మద్ సిరాజ్ ( Mohammed Siraj ) హిందీ బిగ్ బాస్ ఫేమ్ మహిరా శర్మ ( Mahira Sharma )తో డేటింగ్ లో ఉన్నట్లు గత కొన్నిరోజులుగా ప్రచారం జరుగుతుంది.
వీరిద్దరి సన్నిహితులు డేటింగ్ విషయాన్ని దృవీకరించినట్లు జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. ఇన్స్టాగ్రామ్ లో మహిరా చేసిన ఒక పోస్టుకు సిరాజ్ లైక్ కొట్టడమే కాకుండా ఆమెను ఫాలో అవుతున్నారు.
ఈ క్రమంలో వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నట్లు రూమర్లు వెలువడ్డాయి. అయితే జరుగుతున్న ప్రచారంపై నటి మహిరా శర్మ తల్లి సానియా శర్మ స్పందించారు. మహిరా శర్మ నటి, ఆమెకు ఎవరితోనైనా సంబంధాలు కలుపుతారు. వాటిన్నింటినీ ఎవరూ నమ్మవద్దు అంటూ ఆమె స్పష్టం చేశారు.
ఇదిలా ఉండగా దిగ్గజ గాయని ఆశా భోస్లే మనవరాలు జనై భోస్లే ( Zanai Bhosle )తో సిరాజ్ డేటింగ్ చేస్తున్నట్లు గతంలో ప్రచారం జరిగింది. అయితే భోస్లే తనకు సోదరి లాంటిదని సిరాజ్ జరిగిన ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు.