IPL 2025 New Rules | ఐపీఎల్-2025 సీజన్ శనివారం నుండి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో బౌలర్లను దృష్టిలో ఉంచుకుని బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది.
బంతికి ఉమ్మి రాయడం పై కరోనా సమయం నుండి ఉన్న నిషేధాన్ని తాజగా బీసీసీఐ ఎత్తివేసింది. ఐపీఎల్ లోని చాలా రూల్స్ బ్యాటర్లకు అనుకూలంగా ఉన్నాయని విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి ఇంపాక్ట్ ప్లేయర్ ( Impact Player ), మరియు పవర్ ప్లేలో సర్కిల్ ఆవల ఇద్దరే ప్లేయర్లు వంటి రూల్స్ బౌలర్లకు శాపంగా మారిందని అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి.
ఈ నేపథ్యంలో బీసీసీఐ బాల్ కు సలైవా రాయడం పై ఉన్న నిషేధాన్ని ఎత్తివేసింది. ఈ మేరకు గురువారం ముంబయి లో జరిగిన ఐపీఎల్ కెప్టెన్ల సమావేశంలో మెజారిటీ కెప్టెన్లు బంతికి ఉమ్మిరాయడం పై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయాలనే ప్రతిపాదనకు అంగీకరించారు.
బంతిని రివర్స్ స్వింగ్ చేయడానికి బౌలర్లు బాల్ కు సలైవా ను రాస్తారు. అంతేకాకుండా సెకండ్ ఇన్నింగ్స్ లో రెండవ బంతిని వినియోగించుకునేందుకు బీసీసీఐ అనుమతినిచ్చింది. రెండవ ఇన్నింగ్స్ 11వ ఓవర్ తర్వాత మాత్రమే రెండవ బంతిని వినియోగించాలని పేర్కొంది. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ మాత్రం యథావిధిగా కొనసాగనుంది.